రీ రిలీజ్ లో “సింహాద్రి” వేరే లెవెల్ రికార్డ్!

Published on May 5, 2023 6:44 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో, దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సింహాద్రి మూవీ రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం రీ రిలీజ్ ను వేరే లెవెల్లో ప్లాన్ చేయడం జరిగింది. ఈ చిత్రం ను జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. యంగ్ టైగర్ పుట్టిన రోజు సందర్భంగా దీనిని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అంకిత, భూమిక లు లేడీ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందించడం జరిగింది. మరి ఈ రీ రిలీజ్ మూవీ ఎలాంటి రికార్డ్ లని క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :