రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక వీడియోను షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

Published on Mar 27, 2022 5:45 pm IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా నైట్ బర్త్ డే రోజు వేడుక ను జరుపుకున్నారు. ఈ వేడుకకి సంబందించిన ఒక వీడియో ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా లో షేర్ చేయడం విశేషం.

బర్త్ డే పార్టీ కి సంబంధించిన ఈ విడియో లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ మేరకు తారక్ పై రామ్ చరణ్ ఫన్నీ కామెంట్స్ చేయడం జరిగింది. అనంతరం ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ సందర్భం గా జక్కన్న రాజమౌళి ను కౌగలించుకొని జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ వేడుక లో ఉపాసన కొణిదెల, ప్రణతితో పాటు మరికొందరు పాల్గొన్నారు

అంతేకాక జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదిక గా ఆర్ ఆర్ మూవీ వర్కింగ్ స్టిల్ ను అభిమానులతో పంచుకున్నారు. అది కాస్త వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :