ప్రెస్ మీట్ లో పునీత్ రాజ్ కుమార్ పాటను పడిన జూనియర్ ఎన్టీఆర్!

Published on Dec 10, 2021 4:00 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అన్ని భాషల్లో ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అంతేకాక ప్రెస్ మీట్ ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

బెంగళూరు లో జరిగిన ప్రెస్ మీట్ లో నేడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, నిర్మాత డివివి దానయ్య మరియు రాజమౌళి హాజరు అయ్యారు. అయితే ఈ సమావేశం లో జూనియర్ ఎన్టీఆర్ దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకున్నారు. అతని గౌరవార్ధ గెలెయా గెలెయా అనే పాట ను పాడారు ఎన్టీఆర్. అంతేకాక ఇకపై తను ఈ పాటను ఇంకెక్కడ పాడను అంటూ చెప్పుకొచ్చారు. భావోద్వేగం అయిన జూనియర్ ఎన్టీఆర్, ఆయన ఎక్కడ ఉన్నా, ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ మాపై ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :