యూఎస్‌లో హాఫ్ మిలియన్ దాటిన ‘జ్యో అచ్యుతానంద’!

jyo-achyutananda
‘ఊహలు గుసగుసలాడే’తో దర్శకుడిగా సూపర్ పాపులారిటీ తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్, తాజాగా ‘జ్యో అచ్యుతానంద’ అంటూ తన రెండో సినిమాతోనూ బాగా మెప్పించిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా శ్రీనివాస్ మార్క్ క్లాస్ కామెడీతో అన్నివర్గాల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక యూఎస్‌లో ఈ సినిమా మంచి వసూళ్ళు రాబడుతూ శనివారంతో హాఫ్ మిలియన్ మార్క్ దాటేసింది. ఇప్పటివరకూ యూఎస్ బాక్సాఫీస్ వద్ద సినిమా 523కే డాలర్లు వసూలు చేసింది.

మొదటి షో నుంచే టాక్ అదిరిపోవడంతో కలెక్షన్స్ ఇప్పటికీ స్టడీగానే సాగుతున్నాయి. నారా రోహిత్, నాగ శౌర్య, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రోహిత్-శౌర్యల మధ్యన వచ్చే ఎమోషనల్ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ రమణ అందించిన మ్యూజిక్ కూడా ఓ హైలైట్‌గా నిలిచింది.