‘జ్యో అచ్యుతానంద’ ట్రైలర్ : ట్రయాంగిల్ లవ్‌స్టోరీ!
Published on Aug 21, 2016 9:51 pm IST

jyo-achyutananda
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు అవసరాల శ్రీనివాస్, తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత మళ్ళీ చాలా కాలానికి ఆయన ‘జ్యో అచ్యుతానంద’ అనే మరో రొమాంటిక్ కామెడీతో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. నారా రోహిత్, నాగ శౌర్య హీరోలుగా నటించిన ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక ఈ సాయంత్రం హైద్రాబాద్‌లో వైభవంగా జరిగింది. కళ్యాణ్ కోడూరి సమకూర్చిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు.

ఇక టీజర్‌తోనే సినిమా ఎలా ఉండనుందో పరిచయం చేసిన శ్రీనివాస్, ట్రైలర్‌తో సినిమా పూర్తి కథను పరిచయం చేస్తూ ఆసక్తి రేకెత్తించారు. ఇద్దరు అన్నదమ్ములు ఒకే అమ్మాయిని ప్రేమించడం అన్న కథాంశంపై సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. రోహిత్, శౌర్య, రెజీనాల మధ్యన వచ్చే సన్నివేశాలు రిఫ్రెషింగ్ ఉండనున్నాయని కూడా ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకూ పెద్దగా అంచనాలేవీ లేకుండా ఉన్న ఈ సినిమాపై ఈ ట్రైలర్‌తో మంచి అంచనాలే వస్తాయని చెప్పొచ్చు. వారాహి చలన చిత్రంపై సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 
Like us on Facebook