రెజినా ప్రేమను ఎవరు గెలుచుకుంటారో చూడాలనుంది : రాజమౌళి

SS-RAJAMOULI
దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమాకైనా పాజిటివ్ కామెంట్ ఇచ్చాడంటే ఆ సినిమా ఖచ్చితంగా బాగుంటుందని ప్రేక్షకుల్లో, సినీ ప్రముఖుల్లో ఓ గట్టి నమ్మకముంది. అలాంటి పవర్ ఫుల్ కామెంట్ నే రాజమౌళి తాజాగా ‘జ్యోఅచ్యుతానంద’ చిత్రానికి ఇచ్చారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ చిత్ర ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజారయ్యారు జక్కన్న.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘కళ్యాణ రమణ అందించిన సంగీతం చాలా బాగుంది. ఇది రొమాంటిక్ కామెడీ కన్నా కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని అనిపిస్తోంది. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో రెజినా ప్రేమను ఎవరు గెలుచుకుంటారో చూడాలనుంది’ అన్నారు. శ్రీనివాస అవసరాల తన రెండవ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఉండనుంది. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రెజినా, నాగ శౌర్య, నారా రోహిత్ లు నటిస్తున్నారు.