కార్తి సినిమాలో ముఖ్య పాత్రలో జ్యోతిక !

Jyothika

తమిళ హీరో కార్తి మలయాళ డైరెక్టర్, పాపనాశనమ్(దృశ్యం) ఫేమ్ జీతూ జోసఫ్ దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పారు. ఇక ఈ చిత్రంలో కార్తి వదిన నటి జ్యోతిక ఒక ముఖ్య పాత్రలో నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో వున్నా ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక కార్తి ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఖైదీ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ తో సినిమా చేయనున్నాడు కార్తి. ఈసినిమాలో కార్తీ కి జోడిగా కన్నడ బ్యూటీ రష్మిక నటించనుంది. ఈ చిత్రంతో ఆమెకోలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Exit mobile version