9కోట్లు సంపాదించిన జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ సినిమా

jyotika
జ్యోతిక తమిళనాట ‘జ్యో’ పేరుతొ యమ పాపులర్ అయిన విషయం మనకు తెలిసినదే. అయితే తమిళ నటుడు సూర్యతో వివాహం అనంతరం వెండితెరకు దూరమయ్యింది.

దాదాపు చాలా కాలం విరామం తరువాత జ్యోతిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించింది. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. తమిళనాట ఏకంగా 9కోట్లు సంపాదించినట్టు సమాచారం.

రోషన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సూర్య సొంత బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమాను తెలుగులోకి అనువదించే సూచనలు వున్నాయి.

Exit mobile version