అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్‌ 14న జ్యోతిక 50వ చిత్రం..!

Published on Oct 1, 2021 1:18 am IST


కోలీవుడ్‌ ప్రముఖ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఉడన్పిరప్పే’. అక్టోబర్‌ 14న ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ధైర్యవంతురాలైన తంజావుర్‌ మహిళగా ఈ సినిమాలో జ్యోతిక కనిపించబోతుంది. సూర్య 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రొడక్షన్ హౌస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకి శర్వణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే తెలుగులో ఈ చిత్రం ‘రక్త సంబంధం’ పేరుతో విడుదల కాబోతుంది. ఈ సినిమాలో సముద్రఖని, శశికూమార్‌ తదితరలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక గతేడాది ‘పొన్‌మగళ్‌ వందాళ్‌’ చిత్రంతో వచ్చి ఆకట్టుకుంది. అమెజాన్‌ ప్రైమ్ వేదిక ద్వారానే విడుదలైన ఈ సినిమా అటు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.

సంబంధిత సమాచారం :