ఆ వార్తల్లో నిజంలేదన్న రాఘవేంద్రరావ్ !

25th, January 2018 - 02:58:22 PM

గత కొన్ని రోజులుగా సీనియర్ దర్శకులు కె.రాఘవేంద్రరావు గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేసిందని మీడియాలో రకరకాల వార్తలు వస్తూ వచ్చాయి. దీంతో చాలామంది ఈ వార్తా నిజమేననుకుని ఆయనకు ఫోన్ ద్వారా శుభాకాంక్షురాలు చెప్పే ప్రయత్నం చేశారు.

ఇలా అనేక మంది కాల్స్ చేసి విష్ చేస్తుండటంతో స్పందించిన దర్శకేంద్రుడు ఆ వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారట. అంతేగాక ప్రస్తుతం ఎస్.వి.సి.సి లో చేస్తున్న ప్రోగ్రామ్స్ కాక ఇంకొన్నిటిని చేయాలని ఉందని కూడా తెలిపినట్టు సమాచారం. మరి దీనిపై ఆయన అధికారికంగా ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.