వైరల్ స్నాప్ : “భోళా శంకర్” సెట్స్ లో దర్శకేంద్రుని ప్రెజెన్స్.!

Published on Feb 11, 2023 3:11 pm IST


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా మరో స్టార్ హీరోయిన్ అయినటువంటి కీర్తి సురేష్ చిరు సోదరి పాత్రలో నటిస్తున్న చిత్రం “భోళా శంకర్”. మరి దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ సినిమా సెట్స్ లో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయినటువంటి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు కనిపించడం ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

మరి ఈ పిక్ లో చూస్తే మెగాస్టార్ సహా కీర్తి సురేష్ గెటప్ శ్రీను మరియు వెన్నెల తదితర నటులు కనిపిస్తున్నారు. అంతే కాకుండా చిరు లుక్ కూడా సాలిడ్ గా ఉంది. ఇక పక్కన చూసినట్టు అయితే శేఖర్ మాస్టర్ మరియు ఆని మాస్టర్ కూడా కనిపిస్తున్నారు. దీనితో ఈ సినిమా సెట్స్ నుంచి ఈ ఇంట్రెస్టింగ్ స్నాప్ సినీ వర్గాల్లో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :