‘కాకా’కి ఉన్న ఖాళీ ‘డాకు’కి లేదా?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కొల్లి కలయికలో సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన టైటిల్ గ్లింప్స్ తో సినిమాకి “కాకా” అని నామకరణం కూడా చేసారు. ఇక ఇందులో థమన్ స్కోర్ మంచి హైలైట్ గా నిలిచింది.

మన సీనియర్ హీరోస్ తో మంచి ట్రాక్ రికార్డ్ సెట్ చేసుకున్న థమన్ లేటెస్ట్ బాలయ్యకి, ఇదే బాబీ కలయికలో చేసిన డాకు మహరాజ్ సినిమాకి అందించిన సంగీతానికి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

అయితే మొన్ననే వచ్చిన కాకా గ్లింప్స్ ఓ ఎస్ టీ (ఒరిజినల్ సౌండ్ ట్రాక్)ని వదలడానికి ఉన్న ఖాళీ ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న డాకు మహరాజ్ ఓ ఎస్ టీ వదలడానికి థమన్ కి సమయం లేదా? మరి థమన్ బాలయ్య అభిమానుల కోరిక ఎప్పుడు తీరుస్తాడో చూడాలి.

Exit mobile version