కబాలి ఫస్ట్ వీకెండ్ : కలెక్షన్స్‌లో ప్రభంజనం!

kabali
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కబాలి’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. సినిమాకు మొదటి రోజునుంచే నెగటివ్ టాక్ వచ్చినా కూడా రజనీ సినిమా కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూసిన అభిమానులంతా చూస్తూ ఉండడంతో కలెక్షన్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని తేడా లేకుండా విడుదలైన అన్నిచోట్లా కబాలి కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తోంది. మూడు రోజుల్లో ఈ సినిమా సుమారు 210 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందంటే కబాలి కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూశారో అర్థం చేసుకోవచ్చు.

పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన రియలిస్టిక్ గ్యాంగ్‌స్టర్ సినిమా అయిన ‘కబాలి’ని కళైపులి థాను నిర్మించారు. రజనీ కాంత్ మాస్ ఇమేజ్‌కు భిన్నంగా సాగిన ఈ సినిమాలో రజనీ యాక్టింగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక సోమవారం రోజున కూడా కలెక్షన్స్ బాగున్నాయని తెలుస్తోంది. మున్ముందు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ఇంకెలా ఉంటాయన్నది ఎదురుచూడాలి. ఓవర్సీస్ మార్కెట్లో సినిమా ఊహించని స్థాయిలో మెప్పిస్తోంది.