‘బాహుబలి’ రికార్డును బేక్ చేసిన ‘కబాలి’

22nd, July 2016 - 12:00:04 PM

kabali-baahubali
అప్పుడే రజనీకాంత్ ‘కబాలి’ రికార్డుల వేట మొదలైంది. భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా 4000 థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యూఎస్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఓవర్సీస్ లో 400 థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రీమియర్ల రూపంలోనే సుమారు $1.5 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఈ రికార్డు గత సంవత్సరం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి పేరిట ఉండేది. బాహుబలి ప్రీమియర్ల ద్వారా 1.39 కొల్లగొట్టింది.

అప్పట్లో ఈ రికార్డును తిరగరాయాలంటే మరో ఐదారేళ్ళ పడుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ కబాలి మాత్రం అవలీలగా ఆ రికార్డుని బ్రేక్ చేసేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కబాలి ఈ వారంతం ముగిసేసరికి $ 4.5 మిలియన్ డాలర్ల వసూళ్లను కొల్లగొడుతుందని తెలుస్తోంది. ఒక్క యూఎస్ లోనే రికార్డుల మోత ఇలా ఉంటే ఇక ఇండియాలో ఎన్ని రికార్డులు నమోదవుతాయో చూడాలి.