కబాలి మూడవరోజు కృష్ణ, నెల్లూరు కలెక్షన్స్ రిపోర్ట్ !

25th, July 2016 - 10:32:27 AM

kabali
‘రజనీకాంత్’ హీరోగా నటించిన ‘కబాలి’ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ మధ్య పెద్ద ఎత్తున విడుదలై అద్భుతమైన ఓపెనింగ్ ఫిగర్స్ సాధించిన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటిరోజు నుండి మిక్స్డ్ టాక్ తో నడుస్తున్న ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో మాత్రం బాగానే జోరు చూపిస్తోంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్ కలెక్షన్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టించిన ఈ చిత్రాన్ని ఎప్పుడూ లేనంతగా తెలుగు ప్రేక్షకులు సైతం బాగానే ఆదరిస్తున్నారు.

తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కృష్ణా ఏరియాలో మూడవరోజు రూ. 33. 57 లక్షల షేర్ సాధించి మూడురోజులకు కలిపి రూ. 1. 26 కోట్ల షేర్ వసూళ్లు ఖాతాలో వేసుకోగా నెల్లూరు జిల్లా ఏరియాలో 3వ రోజు రూ. 11. 30 లక్షల షేర్ రాబట్టి మొత్తం మూడురోజులకు కలిపి రూ. 59. 50 లక్షల షేర్ సాధించింది.