బెంగుళూరులో నిలిపివేయబడ్డ ‘కబాలి’ షోలు

21st, July 2016 - 07:22:14 PM

kabali
రేపు ప్రపంచవ్యాప్తంగా ‘కబాలి’ చిత్రం విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఎక్కడా లేని విధంగా తమిళనాడు, కర్ణాటకలలో భారీ క్రేజ్ ఉంది. అక్కడున్న రజనీ అభిమానులు సినిమా విడుదల కోసం రకరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరైతే రిచ్ గా బెంగుళూరులోని కొన్ని ఫైవ్ స్టార్ హోటళ్లను బుక్ చేసుకుని వాటిలో కబాలి స్పెషల్ షోలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ వారి ప్లాన్స్ వర్కవుట్ కాలేదు.

కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, కర్ణాటక ఫిలిం ఎగ్జిబిటర్ అసోసియేషన్లు కలిసి ఇలా సినిమాను అధికారిక థియేటర్లలో కాకుండా హోటళ్లలో ప్రదర్శించడం సినిమా వాతావరణానికి, సినిమా హాళ్ల యాజమాన్యానికి నష్టం చేకూరుస్తుందని, వాటికి వెంటనే నిలిపివేయాలని లేకపోతే ఉదయం ప్రదర్శించాల్సిన షోలను కూడా రద్దు చేస్తామని కలెక్టర్ కు విన్నవించారు. దీంతో కలెక్టర్ ఈ ఫైవ్ స్టార్ స్క్రీనింగ్ ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.