ప్రీమియర్ షోస్‌తో ‘కబాలి’కి అదిరిపోయే కలెక్షన్స్!

kabali
సూపర్ స్టార్ రజనీ కాంత్ అభిమానులకు పండగరోజుగా ఆయన హీరోగా నటించిన ‘కబాలి’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. నిన్న అర్థరాత్రి నుంచే యూఎస్‌తో పాటు పలు ఇతర దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోస్ ప్రదర్శితం కాగా, ఈ ప్రీమియర్ షోస్‌తో కబాలికి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రీమియర్ షోస్‌తోనే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇది ఇండియన్ సినిమాకే సరికొత్త రికార్డుగా చెప్పబడుతోంది.

తమిళంళో రియలిస్టిక్ సినిమాల దర్శకుడిగా పేరున్న పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమా రియలిస్టిక్ సినిమాగా పేరు తెచ్చుకున్నా, రజనీ మార్క్ అంశాలేవీ సినిమాలో లేకపోవడం అభిమానులను బాగా నిరాశపరిచింది. అన్నిచోట్లా సినిమాకు ఊహించిన స్థాయిలో స్పందన అయితే రాలేదు. కాగా సినిమాకు మొదట్నుంచీ విపరీతమైన క్రేజ్ ఉండడంతో, ఆ క్రేజ్ దృష్ట్యానే ఈ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది. కళైపులి థాను నిర్మించిన ఈ సినిమాలో రాధికా ఆప్టే, ధన్సిక ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.