అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ టీజర్ విడుదలకానుంది !

kabir2

తెలుగు కల్ట్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ఇప్పుడు ‘ఖబీర్ సింగ్’ గా హిందీలో రీమేక్ అవుతుంది. షాహిద్ కపూర్, కియరా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఒరిజినల్ వెర్షన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ రేపు విడుదలకానుంది. మరి ఈ టీజర్ తో సందీప్ హిందీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాడో లేదో చూడాలి. భూషణ్ కుమార్ ,మురాద్ ఖేతని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 21న విడుదలకానుంది.

ఇక అర్జున్ రెడ్డి ప్రస్తుతం హిందీ తో పాటు తమిళంలోనూ రీమేక్ అవుతుంది. ఆదిత్య వర్మ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు.

Exit mobile version