వైరల్ : పవన్ క్రేజ్ ని సరిగ్గా వాడుకోని “కబ్జ” టీం.?

Published on Mar 17, 2023 9:00 am IST

ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి వచ్చిన భారీ చిత్రం “కబ్జ” కోసం అందరికీ తెలిసిందే. కన్నడ స్టార్ హీరోలు రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కు హీరోలుగా నటించిన ఈ చిత్రం కేజీయఫ్ సిరీస్ తర్వాత మళ్ళీ తరహా ట్రీట్ ఇచ్చే సినిమాల భారీ హైప్ ని రేపింది. కానీ లాస్ట్ మినిట్ లో అయ్యితే అన్ని భాషల్లో సరైన ప్రమోషన్స్ లేక సాధారణ రిలీజ్ గానే వచ్చింది. మరి తెలుగులో కూడా మంచి క్రేజీ ప్రమోషన్స్ చేసే స్కోప్ ఉండే రేంజ్ చిత్ర యూనిట్ కి ఉన్నప్పటికీ అది కూడా వారు చేయలేదు.

ఈ సినిమా యూనిట్ కి గాని దర్శకుడు ఆర్ చంద్రు కి మన టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ముందు నుంచి ఉంది కానీ దీనిని మేకర్స్ అయితే తెలుగు మార్కెట్ లో బాగా తీసుకెళ్లలేకపోయారు. కన్నడ లోనే అక్కడ రెండో సాంగ్ రిలీజ్ సమయంలో పవన్ ఈ సినిమా యూనిట్ ని ఆల్ ది బెస్ట్ చెప్తున్నా ప్రెస్ నోట్ ని అక్కడ వేశారు.

అలాగే లేటెస్ట్ గా అయితే దర్శకుడు ఆర్ చంద్రు కూడా పవన్ ని కలిసి ఆయన తమకు ఎంతో సపోర్ట్ అందించారని ఓ పిక్ కూడా షేర్ చేయడం వైరల్ గా మారింది. ఇలా పవన్ లాంటి హీరో ఈ భారీ సినిమాకి సపోర్ట్ ఇవ్వడం మామూలు విషయం కాదు కానీ ఇవేవి చాలా మందికి తెలియవు. దీనితో సినిమా రిలీజ్ టైం లో హైప్ లోనే సినిమా వస్తుందని చెప్పాలి. మరి పవన్ క్రేజ్ తో అయినా గట్టి ప్రమోషన్స్ ని తెలుగులో చేసి ఉంటే మరింత హైప్ సినిమాకి చేరి ఉండొచ్చు.

సంబంధిత సమాచారం :