సాలిడ్ విజువల్స్ తో గ్రాండ్ గా “కబ్జా” ట్రైలర్.!

Published on Mar 5, 2023 8:04 am IST

కన్నడ సినిమా నుంచి కేజీయఫ్ మరియు కాంతారా లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో నెక్స్ట్ బిగ్ థింగ్ అంటూ వస్తున్న మరో సెన్సేషనల్ సినిమా “కబ్జా”. రియల్ స్టార్ హీరో ఉపేంద్ర హీరోగా ఆర్ చంద్రు దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం టీజర్ తోనే ఎనలేని హైప్ ని సెట్ చేసుకుంది. మరి అయితే ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మేకర్స్ అయితే ఒకో భాషలో ట్రైలర్ ని పెద్దగా హంగామా లేకుండానే రిలీజ్ చేశారు.

అయితే ఈ ట్రైలర్ మాత్రం అంచనాలు రీచ్ అయ్యే లానే ఉందని చెప్పాలి. మెయిన్ గా ట్రైలర్ లో అందరి దృష్టి ఆకట్టుకున్న అంశం ఏదన్నా ఉంది అంటే ఆ గ్రాండ్ విజువల్స్ అని చెప్పాలి. అలాగే చాలా మంది టీజర్ తో అయితే కేజీయఫ్ కి మరో సినిమా అని అనుకున్నారు కానీ ట్రైలర్ చూసాక సినిమా బ్యాక్ డ్రాప్ పై క్లారిటీ వస్తుంది. ఇక దర్శకుడు చూపించిన ప్రతి విజువల్ కూడా సాలిడ్ గా ఉండగా ఎమోషన్స్ కి కూడా అంతే ప్రాధాన్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది.

ఇక నమ్మ ఉపేంద్ర అయితే తన అగ్రెసివ్ రోల్ లో పలు షేడ్స్ తో నెక్స్ట్ లెవెల్ లో కనిపించారు. అలాగే తనకి ప్రత్యర్థి పాత్రలో కిచ్చా సుదీప్ పవర్ ఫుల్ గా కనిపిస్తుండగా శ్రేయ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారని చెప్పాలి. అలాగే ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యేలా ఉంది. ఇక నిర్మాతల నిర్మాణ విలువలు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మరి ఈ మార్చ్ 17న వచ్చే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :