ఈ నెల 28న ‘కాయ్ రాజా కాయ్’ ఆడియో..

kaai-raja-kai
ఆనంద్… అతని జీవితంలో అనందం తప్ప మిగతావన్నీ ఉన్నాయని ఫీల్ అయ్యే సగటు మధ్యతరగతి యువకుడు. ఒక రోజు అతని స్నేహితులతో కలసి ‘కాయ్ రాజా కాయ్’ ఆట ఆడతాడు. ఆ ఆట వలన ముగ్గురి స్నేహితుల జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అనే కధాంశంతో రూపొందిన సినిమా ‘కాయ్ రాజా కాయ్’. మారుతి శిష్యుడు శివ గణేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను మారుతి టాకీస్ సమర్పణలో ఫుల్‌మూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గోపాలరావు నిర్మించారు. జేబీ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఈ నెల 28న విడుదల చేస్తున్నారు.

ఆనంద్ గా ‘గ్రీన్ సిగ్నల్’ ఫేం మానస్ నటించాడు. అతని స్నేహితులుగా రామ్ ఖన్నా, రవి.. విలన్ పాత్రలో హరి నటించారు. శ్రావ్య, షామిలి హీరోయిన్లు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుతీ మాట్లడుతూ.. కొత్త నటీనటులతో కొత్త పాయింట్ తో సరికొత్త జోనర్ లో నా శిష్యుడు శివ గణేష్ ‘కాయ్ రాజా కాయ్’ సినిమాను తెరకెక్కించాడు. ఈ నెల సెప్టెంబర్ 28న ఆడియోను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. సినిమా విజవంతం కావాలని ఆశిస్తున్నాను అని అన్నారు. ‘కాయ్ రాజా కాయ్’ పూర్తి వినోదాత్మక చిత్రమని హీరో మానస్ తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో దర్శకనిర్మాతలు, రామ్ ఖన్నా, హరి పాల్గొన్నారు.

Exit mobile version