కైకాల ఆరోగ్యం రూమర్స్ పై ఆయన కుమార్తె క్లారిటీ.!

Published on Nov 23, 2021 12:25 pm IST


ఇటీవల భారతదేశ సినీ ఇండస్ట్రీ దగ్గర వెటరన్ నటుడు అయినటువంటి కైకాల సత్యనారాయణ ఆరోగ్యం కాస్త క్షీణించడం జరిగిందని వచ్చిన వార్త కాస్త కలతను రేపింది. దీనితో అనేక మంది సినీ తారలు ఆయన ఆరోగ్యం కుదుట పడాలని కోరుకున్నారు అలాగే మెగాస్టార్ చిరంజీవి వెంటనే ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం అందించారు.

అయినప్పటికీ పలు మీడియా వర్గాల్లో మాత్రం ఆయన ఆరోగ్యం పట్ల పలు రూమర్స్ స్ప్రెడ్ చెయ్యడం మాత్రం ఆగలేదు. దీనితో వీటి అన్నిటికీ చెక్ పెడుతూ ఆయన కుమార్తె కైకాల రమాదేవి గారు ఒక ఆడియో క్లిప్ తో క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారి ఆరోగ్యం చాలా కుదుటగా ఉందని. అంతేకాకుండా చికిత్సకి కూడా చాలా చురుకుగా స్పందిస్తున్నారని తెలిపారు. అందుచేత ఆయన ఆరోగ్యం పట్ల ఎలాంటి రూమర్ వార్తలని ప్రచారం చేయవద్దని ఆమె సూచించి రిక్వెస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :

More