కైకాల సత్యనారాయణ గారి లేటెస్ట్ హెల్త్‌ బులిటెన్‌ !

Published on Nov 21, 2021 10:38 pm IST

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ గారు తీవ్ర అస్వస్థతకు గురై నిన్న ఉదయం అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, ఐసీయూలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ గారి అనారోగ్యానికి సంబంధించి హెల్త్‌ బులిటెన్‌ ను అపోలో వైద్యులు విడుదల చేశారు. ఇంకా వెంటిలేటర్‌ మీదే సత్యనారాయణ గారికి చికిత్స కొనసాగుతందని వైద్యులు తెలిపారు.

వైద్యులు విడుదల చేసిన మెసేజ్ ఈ విధంగా ఉంది. “కైకాల సత్యనారాయణ గారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌ పై చికిత్స జరుగుతోంది. బీపీ లెవల్స్‌ చాలా తక్కువగా ఉన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది’’ అని తెలియజేశారు.

సంబంధిత సమాచారం :

More