సీనియర్ నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి విషమం..!

Published on Nov 21, 2021 12:37 am IST


సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించినట్టుగా ఉంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్‌ని విడుదల చేశారు.

ఈ రోజు ఉదయం 7.30 గంటలకు కైకాల ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని అన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని, కైకాలను కాపాడడానికి వైద్యులు తమ వంతు కృషి చేస్తున్నారని హెల్త్ బులిటిన్ ద్వారా తెలియచేశారు.

సంబంధిత సమాచారం :