తన మేనేజర్ అరెస్ట్ పట్ల వివరణ ఇచ్చిన కాజల్ !

25th, July 2017 - 01:34:10 PM


స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీ డ్రగ్స్ కేసులో గా అరెస్టైన విషయం అంతటా సంచలనం రేపిన సంగతి తెల్సిందే. దీనిపై కాజల్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కాజల్ కూడా తన వంతు భాద్యతగా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ఆమె మాట్లాడుతూ ‘రోనీ విషయం తెలిసి షాక్ అయ్యాను. సొసైటీకి హానికరమైన ఇలాంటి విషయాలకు నేను అస్సలు సపోర్ట్ చేయను. ఇది కూడా ఎందుకు చెబుతున్నానంటే నా కోసం పనిచేసే వాళ్ళ పట్ల కేర్ తీసుకుంటాను తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళను. ఒక్కసారి వృత్తిపరమైన పనులు ముగిశాక వాళ్ళ పర్సనల్ వ్యవహారాలను పట్టించుకోను’ అన్నారు.