హిందీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన కాజల్ అగర్వాల్..

kajal-agarwal
సౌత్ సినిమాల్లో కాస్త క్రేజ్ సంపాదించిన ప్రతి హీరోయిన్ హిందీలో అడుగుపెట్టాలని కలలు కంటుంది. అక్కడైతే ఎక్కువ రీచ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటాయి. ఇలా ఆలోచించే హీరోయిన్లకు కాజల్ అగర్వాల్ అతీతం ఏమి కాదు. గతంలో అజయ్ దేవగన్ ‘సింగం’, అక్షయ్ కుమార్ ‘స్పెషల్ 26’ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ సినిమాలు ఆమెకు హిందీలో గుర్తింపు తెచ్చిపెట్టాయి.

తాజాగా దీపక్ తిజోరీ దర్శకత్వంలో రూపొందనున్న ‘దో లఫ్జోన్ కీ కహానీ’ సినిమాలో హీరోయిన్ పాత్ర కాజల్ అగర్వాల్ ను వరించింది. రణ్‌దీప్ హుడా ఈ సినిమాలో హీరో. కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ చాలా శక్తిమంతంగా ఉంటుందట. సౌత్ సినిమాల్లో కాజల్ నటన నచ్చడంతో దర్శకుడు దీపక్, ‘దో లఫ్జోన్ కీ కహానీ’లో హీరోయిన్ గా ఎంపిక చేశారు. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర రావడంతో కాజల్ సంతోషానికి అవధులు లేవు. ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వెతుకుంటూ వస్తాయని సన్నిహితుల వద్ద చెప్తుందట. ఇక్కడిలా అగ్ర స్థానానికి చేరితే హిందీలో రెమ్యునరేషన్ కూడా గట్టిగానే లభిస్తుంది.

Exit mobile version