వైరల్ పిక్ : కొడుకు నీల్ తో కాజల్ అగర్వాల్ బ్యూటిఫుల్ పిక్

వైరల్ పిక్ : కొడుకు నీల్ తో కాజల్ అగర్వాల్ బ్యూటిఫుల్ పిక్

Published on Dec 28, 2022 5:00 PM IST

టాలీవుడ్ స్టార్ కథానాయికల్లో ఒకరైన కాజల్ అగర్వాల్ ఫస్ట్ తెలుగు మూవీ లక్ష్మి కళ్యాణం. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా మంచి విజయం అందుకున్న కాజల్, అనంతరం కృష్ణవంశీ తెరకెక్కించిన చందమామ మూవీలో తన ఆకట్టుకునే అందం, అభినయంతో ఆడియన్స్ ని ఆకర్షించారు. ఆపైన రామ్ చరణ్ హీరోగా రాజమౌళి తీసిన మగధీర సినిమా అవకాశం ఆమెకు రావడం, ఆ మూవీ అతి పెద్ద విజయం అందుకోవడంతో కెరీర్ పరంగా అక్కడినుండి కాజల్ వెనుతిరిగి చూసుకోలేదు.

తెలుగు తో పాటు తమిళ్, హిందీ వంటి భాషల్లో కూడా పలు సక్సెస్ఫుల్ సినిమాలు చేసిన కాజల్, 2020లో గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కుమారుడు నీల్ కి జన్మనిచ్చిన కాజల్, ప్రస్తుతం తమ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక తరచు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫ్యాన్స్, ఆడియన్స్ తో పలు విషయాలు షేర్ చేసుకునే కాజల్, లేటెస్ట్ గా తన కుమారుడు నీల్ తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్ ని పోస్ట్ చేసారు. ప్రస్తుతం కొడుకుతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను అంటూ కాజల్ పోస్ట్ చేసిన ఆ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు