‘క్వీన్’ రీమేక్ లో కాజల్ అగర్వాల్ ?


2014 లో విడుదలైన బాలీవుడ్ ‘క్వీన్’ చిత్రం ఎంతటి ఘన విజయం సాదించిందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు గాను సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన హీరోయిన్ కంగనా రనౌత్ కు జాతీయ అవార్డు కూడా దక్కింది. అందుకే ఈ చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ రీమేక్ హక్కులను దక్కించుకున్న నటుడు, నిర్మాత త్యాగరాజన్ ఈ సినిమాను మొదట్లో తమన్నాతో చేద్దామనుకున్నారు. దాదాపు సినిమా మొదలయ్యే దశకు చేరుకుంది.

కానీ రెమ్యునరేషన్ విషయంలో తేడాలు రావడంతో ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఇక తాజాగా తమిళ సినీ వర్గాల నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను తమన్నా స్థానంలోకి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు కూడా జరుగుతున్నాయని త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశముందని తెలుస్తోంది. మరి తమన్నా చేజార్చుకున్న అవకాశాన్ని కాజల్ అగర్వాల్ అయినా అందుకుంటుందో లేదో చూడాలి.