యాక్షన్ ఓరియెంటెడ్ రోల్స్ చేయాలనుకుంటున్న కాజల్ !


‘ఖైదీ నెం 150’ చిత్రంతో మరోసారి టాప్ రేస్ లో చేరిన స్టార్ హీరో కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో అజిత్ ‘వివేగం’, విజయ్ – అట్లీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. మొన్ననే తన పేరు మీద ఒక పర్సనలైజ్డ్ యాప్ ను లాంచ్ చేసిన ఆమె ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనే అంశంపై ఆసక్తికర అంశాలను బయటపెట్టింది. ప్రముఖ మీడియా ఛానెల్ తో ముచ్చటించిన ఆమె తన కెరీర్లో ‘మగధీర’ చిత్రంలో మిత్రవింద, ‘దో లాఫ్జోన్ కి కహాని’ లో జెన్నీ, ‘తుపాకి’ లో నిషా, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో ప్రియా పాత్రలు చాలా ఉత్తమమైనవని చెప్పారు.

అలాగే భవిష్యత్తులో యాక్షన్ ఓరియెంటెడ్, ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్స్ చేయాలనుందని, మణిరత్నం, శంకర్ వంటి టాప్ డైరెక్టర్లతో పని చేయాలనుంది మనసులో కోరికను బయటపెట్టింది. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల మీద ఎక్కువ దృష్టి పెట్టానని, ప్రస్తుతం తాను చేస్తున్న ‘వివేగమ్, నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాల్లో తన పాత్రలు చాలా బలంగా ఉంటాయని, దర్శకులు గొప్పగా డిజైన్ చేశారని తెలిపింది.