మరోసారి వాయిదా పడ్డ కాజల్ “సత్యభామ”


సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు వరకు అనేక భాషల్లో ఎన్నో చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. అలా తన కెరీర్ లో ఆమె చేసిన 60వ చిత్రమే “సత్యభామ”. ఓ ఇంట్రెస్టింగ్ కాప్ డ్రామాగా దర్శకుడు సురన్ చిక్కాల తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా మేకర్స్ సరైన డేట్ కోసం చూస్తూనే ఉన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఓ డేట్ ని అనౌన్స్ చేసి వాయిదా వేయగా తాజాగా ఈ మే 25న విడుదల కావాల్సి ఉంది.

కానీ ఇప్పుడు ఈ డేట్ నుంచి కూడా మేకర్స్ చిత్రాన్ని వాయిదా వేసినట్టుగా తెలిపారు. అలా తాజాగా దీనితో పాటుగా కొత్త డేట్ ని కూడా లాక్ చేశారు. మరి దీనితో ఈ సినిమా ఈ జూన్ 7న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతున్నట్టుగా తెలియజేసారు. సో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అప్పుడు వరకు ఆగాలి అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాగినీడు తదితరులు కీలక పాత్రల్లో నటించగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. అలాగే ఆరం ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version