కాజల్, సమంత ఇద్దరూ పోటీలో ఉన్నారట!

samantha-and-kajal
తమిళ సూపర్ స్టార్ విజయ్‌కి తమిళనాట ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయి బాక్సాఫీస్ స్టామినా ఉన్న హీరోగా విజయ్‌కి తమిళంలో పేరుంది. ఇక తెలుగులోనూ డబ్బింగ్ సినిమాలతో అడపాదడపా మెప్పిస్తూ ఉండే ఈ స్టార్ తాజాగా తనకు ‘పోలీస్’తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు అట్లీతో మరో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఇద్దరు స్టార్ హీరోయిన్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అందులో ఒకరు కాజల్ కాగా, మరొకరు సమంత. స్టార్‌డమ్‍లో ఒకేస్థాయి ఉన్న ఈ ఇద్దరిలో చివరకు ఎవరు ఈ సినిమాకు ఎంపికవుతారన్నది ఆసక్తికరంగా మారింది. కాజల్ హీరోయిన్‌గా దాదాపుగా ఎంపికయ్యారని మొదట్నుంచీ వినిపించగా, ఈమధ్యే సమంత పేరు తెరపైకి వచ్చింది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేశారు.