మహేష్-వంశీ పైడిపల్లి సినిమాలో కాజల్..!?

kajal
సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తూనే, ఆ తర్వాత చేయబోయే రెండు సినిమాలను కూడా ఇప్పుడే లైన్లో పెట్టేసిన విషయం తెలిసిందే. మురుగదాస్ సినిమా పూర్తవ్వగానే, మహేష్, కొరటాల శివతో ఒక సినిమా చేయనున్నారు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి తెరకెక్కించే మరో సినిమాను కూడా సిద్ధం చేశారు. మహేష్ ఇమేజ్‌కు సరిపడేలా వంశీ పైడిపల్లి ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్‍ను రెడీ చేస్తున్నారు. ఇక జూన్‌లో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

కాజల్‌తో ఇదే సినిమా గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ విషయమై చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మహేష్‌తో బిజినేస్‌మేన్, బ్రహ్మోత్సవం సినిమాల్లో నటించి మంచి పెయిర్ అనిపించుకున్న కాజల్, ఇప్పుడు మరో సినిమా చేస్తున్నారన్న ప్రచారం జరగడం విశేషంగా చెప్పుకోవాలి. మరి ఈ ప్రచారంలో నిజమెంతో కూడా తెలియాల్సి ఉంది. పీవీపీ సంస్థ గానీ, దిల్‌రాజుగానీ నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.