అందాల భామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా తర్వాత తను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి సైన్ చేసింది. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు 2 నుండి హైదరాబాద్ లో మొదలయ్యింది. వచ్చేనెల నుండి ఎన్.టి.ఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం కాజల్ ఈ సినిమా నుంచి తప్పుకునే అవకాశం కనిపిస్తోంది. దానికి కారణం ఈ సినిమాకి అవసరమైనన్ని డేట్స్ తన దగ్గర లేకపోవడమే.. ప్రస్తుతం కాజల్ తన దగ్గర ఉన్న డేట్స్ ని రీ షెడ్యూల్ చేస్తోంది. ఒకవేళ డేట్స్ అడ్జస్ట్ కాకపోతే కాజల్ ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకునే అవకాశం ఉంది. కాజల్ దగ్గర నుంచి క్లారిటీ రాగానే ఈ విషయంపై ప్రొడక్షన్ టీం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మధురిమని ఎంపిక చేసారు. బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. 2015 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
