కాజల్.. ‘బాహుబలి’ స్టార్‌కే సూపర్ స్టార్!

kajal

‘బాహుబలి’ సినిమాతో ఇండియన్ సినిమాలో ఓ కొత్త స్టార్‌గా ఎదిగిన రానా, తాజాగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా కొనసాగిన తేజ, ఈమధ్య కాలంలో తన స్థాయికి తగ్గ సినిమా ఒక్కటీ తీయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రానాతో సినిమాను మొదలుపెట్టారు. రానా సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా నిన్ననే సెట్స్‌పైకి వెళ్ళింది. ఇక సెట్స్‌లో సరదాగా కాజల్‌ చేతికి, తన చేతికి ఉన్న ఆర్నమెంట్స్‌ను చూపిస్తూ రానా ఓ ఫోటో తీసి పోస్ట్ చేశారు.

తన ట్విట్టర్ ఎకౌంట్‌లో ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ ‘సూపర్ స్టార్ కో స్టార్ కాజల్‌ను తమ కొత్త సినిమాలోకి ఆహ్వానిస్తున్నాన’ని రానా అన్నారు. ఇక కాజల్ కూడా ఇదే ఫోటో పోస్ట్ చేస్తూ రానాతో కలిసి నటించడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రస్తుతం కరైకుడిలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో నవదీప్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది.