హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల వైపు చూస్తున్న కాజల్ !


చిరంజీవి సరసన ‘ఖైదీ నెం 150’ లో నటించి మరోసారి టాప్ రేంజుకు దూసుకెళ్లిన స్టార్ హీరోయిన్ కాజల్ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళంలో విజయ్, అజిత్ లాంటి బడా హీరోల సినిమాల్లో నటిస్తున్న ఆమె తెలుగులో రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక హిందీలో మాత్రమే ఆమెకు ఆశించిన సక్సెస్ దక్కడం లేదు.

ఎన్నో ఆశలు పెట్టుకుని గతేడాది చేసిన ‘దో లాఫ్జోన్ కి కహాని’ కూడా ఫ్లాప్ గా నిలవడంతో రూటు మార్చిన ఈ ముంబై బ్యూటీ లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించడానికి సిద్ధమైందట. ఒక స్టార్ హీరోయిన్ వద్దకు వెళ్లిన స్క్రిప్ట్ ఒకటి కాజల్ ఒకటి కాజల్ వద్దకు వచ్చిందని, కాజల్ కూడా ఆ లేదే ఓరియెంటెడ్ ప్రాజెక్టుకు ఓకే చెప్పాలనుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ కథేమిటి, ఎప్పుడు ఓకే అవుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే తెలుగులో పెద్దగా సక్సెస్ దక్కని తాప్సి కూడా హిందీలో ‘పింక్’ లాంటి లేడీ ఓరియెంటెడ్ కథలనే ఎంచుకుని టాప్ పొజిషన్ కు చేరుకుంది.