కాజల్ చేతిలో మరో క్రేజీ ప్రాజెక్ట్ !
Published on Jul 13, 2017 11:11 am IST


స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అజిత్ ‘వివేగం’, విజయ్ ‘మెర్సల్’, రానా ‘నేనే రాజు నేనే మంత్రి’, కళ్యాణ్ రామ్ ‘ఎమ్.ఎల్.ఏ’ వంటి సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ హిట్ సినిమా ‘క్వీన్’తమిళ రీమేక్ కు, పి. వాసు డైరెక్షన్లో మరొక చిత్రానికి సిద్దమవుతున్న ఆమెను మరో క్రీజీ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చినట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ కామెడీ ప్రాంచైజీ చిత్రం ‘యమ్ల పగ్లా దివానా’ సినిమా యొక్క మూడవ పార్ట్ లో కాజల్ కు హీరోయిన్ గా ఛాన్స్ దక్కిందంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తి స్థాయి అధికారిక సమాచారం బయటకురాలేదు. ఈ ప్రాజెక్టులో నటుడు ధర్మేంద్రతో పాటు ఆయన కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ లు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

 
Like us on Facebook