కాజల్ అగర్వాల్ మేనేజర్ అరెస్ట్ !

24th, July 2017 - 04:32:01 PM


టాలీవుడ్ డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో రోజు రోజుకి కొత్త వ్యక్తుల పేర్లు బయటికొస్తున్నాయి. ఇప్పటికే సమగ్ర విచారణ చేపట్టిన సిట్ అధికారులు పకడ్బందీగా నిందితుల్ని, అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మేనేజర్ రోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా అతనిపై ఆనుమానం ఉండటంతో నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు.

అతని ఇంట్లో గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ టెస్టుల అనంతరం నిజాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. రోనీ గతంలో లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నా వంటి ఇతర స్టార్ హీరోయిన్లకు కూడా మేనేజర్ గా పనిచేశాడు. రోనీ నుండి ఎలాంటి నిజాలు, ఎవరి పేర్లు బయటికొస్తాయోనని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు.