లేడీ బాస్ గా కనిపించబోతున్న కాజోల్.. నిజమేనా ?

లేడీ బాస్ గా కనిపించబోతున్న కాజోల్.. నిజమేనా ?

Published on Jan 8, 2023 9:00 PM IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నటీనటులను కూడా పాన్ ఇండియా స్టార్స్ నే తీసుకుంటున్నారు. కాగా ఈ సినిమాలో ఓ లేడీ బాస్ పాత్ర ఉందట. సినిమాలో కీలక పాత్ర అయిన ఈ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటిస్తోంది అని పుకార్లు వైరల్ అవుతున్నాయి. మరీ ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ, ఈ న్యూస్ మాత్రం మహేష్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.

ఇప్పటికీ అయితే, మహేష్ సినిమాలో కాజోల్ పాత్ర పై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు