కాంతారా కోవలో రాబోతున్న కలివీరుడు

Published on Sep 19, 2023 11:02 am IST

కన్నడ సినిమాలు తెలుగులోకి రావడం ఈ మధ్య ఆనవాయితీ అయిపోయింది. ముఖ్యంగా కాంతారా నుంచి కన్నడ సినిమాలకు తెలుగులో కూడా గిరాకీ పెరిగింది. కాగా “కలివీర” పేరుతో కన్నడలో రూపొందిన ఓ చిత్రం అనూహ్య విజయం సాధించింది. అక్కడ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తెలుగులోనూ సంచలన విజయం సాధించేందుకు “కలివీరుడు”గా మన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. “కలివీర” తెలుగులో “కలివీరుడు”గా వస్తోంది అన్న ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే… ఈ చిత్రానికి అన్ని ఏరియాల్లో బిజినెస్ అయిపోవడం విశేషం!! ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ క్రేజీ చిత్రాన్ని అత్యంత ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుని… “మినిమం గ్యారంటీ మూవీస్” పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు.

ఈనెల 22న భారీ అంచనాలతో వస్తున్న “కలివీరుడు” చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. “అవి” దర్శకత్వంలో… రియల్ ఫైట్స్ కు పెట్టింది పేరైన కన్నడ సెన్సేషన్ ఏకలవ్య టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో చిరాశ్రీ హీరోయిన్. డేని కుట్టప్ప, తబలా నాని, అనితాభట్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈమధ్య కాలంలో చిన్న సినిమాల్లో బిజినెస్ పరంగా కనీ వినీ ఎరుగని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ఈనెల 22న విడుదల చేసేందుకు నిర్మాత అచ్చిబాబు సన్నాహాలు చేస్తున్నారు. “కాంతారా” కోవలో “కలివీరుడు” తెలుగులోనూ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు!!

సంబంధిత సమాచారం :