సమీక్ష : కలియుగ – బోర్ గా సాగే ఎమోషనల్ డ్రామా !

Published on Dec 6, 2019 11:34 pm IST

విడుదల తేదీ : డిసెంబర్  06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : విశ్వా, స్వాతి దీక్షిత్, శశి కుమార్

దర్శకత్వం : ఎం ఏ తిరుపతి

నిర్మాత‌లు : సి హెచ్ సుబ్రమణ్యం

సంగీతం :  కమల్ డి

సినిమాటోగ్రఫర్ : సత్య వి ప్రభాకర్

విశ్వ, స్వాతి దీక్షిత్ జంటగా, తిరుపతి దర్శకత్వంలో బాలాజీ సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌ పై, నటుడు సూర్య నిర్మించిన సినిమా ‘కలియుగ’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ:

 

వెంకట్ (సూర్య) ప్రకాష్ (శశి కుమార్ రాజేంద్రన్) ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. ప్రకాష్ ను వెంకట్ ప్రాణంగా నమ్ముతాడు. అతని కోసం ప్రాణాలనైనా ఇవ్వటానికి సిద్ధపడతాడు. అయితే సడెన్ గా వెంకటే, ప్రకాష్ ను అతి దారుణంగా కాల్చి చంపేస్తాడు. పోలీస్ లు వెంకట్ ను పట్టుకునే క్రమంలో.. చందు (విశ్వ) అనే మరో వ్యక్తి ప్రకాష్ ను చంపింది నేను అంటూ పోలీస్ లకు లొంగిపోతాడు. ఇంతకీ ఈ చందు ఎవరు ? ఇతనికీ వెంకట్ కి సంబంధం ఏమిటి ? అసలు ఇంతకీ ప్రాణ స్నేహితుడైన ప్రకాష్ ను వెంకట్ ఎందుకు చంపాడు ? ప్రకాష్ వెనుక ఉన్న కథ ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సూర్య తన పాత్రకు తగ్గట్లు తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా తన చెల్లి చనిపోయే సన్నివేశంలో అలాగే ఫ్రెండ్ ను చంపే సీన్ లో సూర్య నటన బాగుంది. ఇక మరో కీలక పాత్రలో నటించిన విశ్వ కూడా చాల బాగా నటించాడు. హీరోయిన్ కాలిపోతున్న సన్నివేశంలో గాని, ఆమె కోసం పిచ్చోడిలా తిరిగే సీన్స్ లో మరియు క్లైమాక్స్ విశ్వ నటన ఆకట్టుకుంటుంది.

ఇక హీరోయిన్ గా నటించిన స్వాతి దీక్షిత్ తన పాత్రలో అవలీలగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. విలన్ గా నటించిన శశి కుమార్ రాజేంద్రన్ కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. దర్శకుడు తిరుపతి తీసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్ బాగుంది. ఆయన రాసుకున్న కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కూడా పర్వాలేదనిపిస్తాయి.

 

మైనస్ పాయింట్స్:

 

కథాకథనాల్లో ప్లో మిస్ అయింది. దర్శకుడు రాసుకున్న కథనం ఆకట్టుకొనే విధంగా లేదు. ఏ సీన్ కి ఆ సీన్ సాగుతున్నా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. దీనికి తోడు ప్లే కూడా స్లోగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. అయితే ట్విస్ట్ లు బాగానే పెట్టారు గాని అవి థ్రిల్ చెయ్యవు.

దర్శకుడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగుతాయి. ఈ రిపీట్ డ్ సీన్స్ మరీ ఎక్కువడం, మెయిన్ స్టోరీలో ఉన్న ఎమోషన్.. ట్రీట్మెంట్ లో లేకపోవడం, దీనికితోడు సినిమాలో చాల కీలక సన్నివేశాల్లో బేసిక్ లాజిక్ లేకపోవడం వంటి అంశాల వల్ల సినిమా రిజల్ట్ మారిపోయింది.

పైగా కథలో పెయిన్ ఫుల్ కంటెంట్ ఉన్నా… దర్శకుడు తిరుపతి ఆ కంటెంట్ ను పూర్తిగా వాడుకోలేదు. కథనాన్ని ఆసక్తికరంగా మలచకపోగా.. ఉన్న కంటెంట్ ను కూడా బాగా ఎలివేట్ చేయలేకపోయారు. ఆయన స్క్రిప్ట్ పై ఇంకా శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు కమల్ డి అందించిన పాటల్లో సెకెండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ చాల బాగుంది. అదే విధంగా ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ బాగాలేదు. ల్యాగ్ సీన్స్ తీసేసి సినిమాని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ ఒకే అనిపిస్తోంది. ఇక నిర్మాత సి హెచ్ సుబ్రమణ్యం పాటించిన నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్లే ఉన్నాయి.

 

తీర్పు :

 

కలియుగ అంటూ వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. మెయిన్ స్టోరీ పాయింట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమాలో కథాకథనాలు సరిగ్గా లేకపోవడం, ఉన్నదాంట్లో కూడా కన్వీన్స్ కానీ ట్రీట్మెంట్ ఉండటం, మరియు లాజిక్ లేని సన్నివేశాలు లాంటి అంశాలు కారణంగా ఈ సినిమా ఫలితం దెబ్బ తింది. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోదు.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :

More