తెలుగు స్టేట్స్ లో “కల్కి” 10 రోజుల వసూళ్లు ఎంతంటే

తెలుగు స్టేట్స్ లో “కల్కి” 10 రోజుల వసూళ్లు ఎంతంటే

Published on Jul 7, 2024 11:57 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “కల్కి 2898 ఎడి”. మరి వీరు సహా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం భారీ వసూళ్లు అందుకొని దూసుకెళ్తుంది.

అయితే ఇప్పుడు మొత్తం 10 రోజుల రన్ ని ఈ చిత్రం కంప్లీట్ చేసుకోగా ఈ 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కల్కి ఎంత రాబట్టిందో తెలుస్తుంది. మరి డే 10 కి గాను పి ఆర్ లెక్కల ప్రకారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5.4 కోట్ల షేర్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే ఇందులో ఒక్క నైజాం మార్కెట్ నుంచే 3 కోట్ల షేర్ రాగా ఇప్పుడు వరకు నైజాంలో ఈ చిత్రం 64 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టు అయితే ఈ చిత్రం మొత్తం 10 రోజుల్లో 154 కోట్ల షేర్ ని ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే అందుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే కల్కి మ్యానియా తెలుగు రాష్ట్రాల్లో మామూలు రేంజ్ లో లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు