నార్త్ అమెరికాలో 15 మిలియన్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో ‘క‌ల్కి’ రికార్డు

నార్త్ అమెరికాలో 15 మిలియన్ డాల‌ర్ల వ‌సూళ్ల‌తో ‘క‌ల్కి’ రికార్డు

Published on Jul 6, 2024 10:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన ‘క‌ల్కి 2898 AD’ ఇండియ‌న్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కేవ‌లం సౌత్ లోనే కాకుండా, నార్త్ లోనూ స్ట‌న్నింగ్ ఫిగ‌ర్స్ తో దుమ్ములేపుతోంది ఈ మూవీ. అటు ఓవ‌ర్సీస్ మార్కెట్ లో కూడా క‌ల్కి దెబ్బ‌కు రికార్డులు బ‌ద్ద‌లవుతున్నాయి.

ఇప్ప‌టికే ప‌లు రికార్డుల‌ను క్రియేట్ చేసిన క‌ల్కి, తాజాగా మ‌రో అరుదైన ఫీట్ సాధించింది. నార్త్ అమెరికాలో ఈ మూవీ ఏకంగా 15 మిలియన్ డాల‌ర్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి ఔరా అనిపించింది. ఈ మార్క్ ను చేరుకున్న ఫాస్టెస్ట్ మూవీగా క‌ల్కి వండ‌ర్స్ క్రియేట్ చేస్తోంది.

మైథాల‌జీ సై ఫై స‌బ్జెక్టుల‌ను ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ హ్యాండిల్ చేసిన తీరుకు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపికా ప‌దుకొనె, దిశా ప‌టాని వంటి టాప్ స్టార్స్ న‌టించగా వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు