ఫస్ట్ మండే ఆల్ టైం రికార్డు వసూళ్లు కొట్టిన “కల్కి”

ఫస్ట్ మండే ఆల్ టైం రికార్డు వసూళ్లు కొట్టిన “కల్కి”

Published on Jul 2, 2024 11:02 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంలో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) సహా మరింత మంది అగ్ర తారలు నటించగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. ఇక ఎన్నో అంచనాలు నడుమ విడుదలకి వచ్చిన ఈ సినిమా వాటి అందుకొని ఇండియన్ సినిమా దగ్గర మరో రికార్డు గ్రాసర్ గా దూసుకెళ్తుంది. అయితే వీకెండ్ అయిపోయి మొదటి సోమవారం మొదలు అయ్యింది.

అయితే ఈ మొదటి సోమవారం కూడా కల్కి సత్తా చాటాడడం విశేషం ఇది ఎంతలా అంటే ఆల్ టైం రికార్డు వసూళ్లు కల్కి ఈ ఫస్ట్ మండే కి వసూలు చేసింది. మరి ఇన్ని రోజులు 100 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం సోమవారం 70 కోట్ల గ్రాస్ ని అందుకోవడం విశేషం. ఇది ఏ సినిమా ఇండియన్ సినిమా కంటే అత్యధికం అని తెలుస్తుంది. దీనితో ఈ చిత్రం సెన్సేషనల్ వసూళ్లు వారంలో కూడా కొనసాగుతాయని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు