‘కల్కి 2898 ఏడి’ : రేపు మూవీ నుండి మరొక బిగ్ అప్ డేట్

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ ప్రతిష్టాత్మక మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని నటిస్తున్నారు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్, తాజాగా రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ వీడియో అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై భారీగా అంచనాలు ఏర్పరిచాయి. విషయం ఏమిటంటే. రేపు సాయంత్రం 5 గం. లకు కల్కి నుండి భారీ అప్ డేట్ అందించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక చిన్న వీడియో బైట్ ద్వారా అనౌన్స్ చేసారు. కాగా అది మూవీకి సంబంధించి న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గురించని అంటున్నాయి సినీ వర్గాలు.

Exit mobile version