నార్త్ లో రూ.150 కోట్ల మార్క్ కు చేరువ‌లో ‘క‌ల్కి’

నార్త్ లో రూ.150 కోట్ల మార్క్ కు చేరువ‌లో ‘క‌ల్కి’

Published on Jul 3, 2024 1:25 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ మరోసారి త‌న స‌త్తా ఏమిటో నార్త్ బాక్సాఫీస్ కు చూపెట్టాడు. ఆయ‌న న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ములేపుతోంది. సాలిడ్ వ‌సూళ్ల‌తో ఈ సినిమా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది.

ఇక ‘క‌ల్కి’ మూవీ హిందీ వెర్ష‌న్ లోనూ సాలిడ్ గా దూసుకెళ్తోంది. ఈ సినిమా మంగ‌ళ‌వారం రోజున రూ.13 కోట్ల మేర క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. దీంతో ఈ సినిమా హిందీలో రూ.141.65 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్లుగా సినీ ఎక్స్ ప‌ర్ట్స్ తెలిపారు. ఇక బుధ‌వారం రోజున ఈ మూవీ రూ.150 కోట్ల మార్క్ ను ట‌చ్ చేస్తుంద‌ని వారు చెబుతున్నారు.

అమితాబ్ బ‌చ్చన్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని వంటి స్టార్స్ న‌టించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. మైథాల‌జి సైన్స్ ఫిక్ష‌న్ అంశాల‌తో ఈ మూవీ తెర‌కెక్క‌గా సి.అశ్వినీ ద‌త్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు