హిందీలో “కల్కి” లేటెస్ట్ వసూళ్ల వివరాలు.!

హిందీలో “కల్కి” లేటెస్ట్ వసూళ్ల వివరాలు.!

Published on Jul 2, 2024 2:56 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ ట్రీట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి చాలా కాలంగా ఇండియన్ సినిమా దగ్గర సరైన సినిమా పడలేదు అనే లోటుని అయితే ఈ చిత్రం తీర్చేసింది. ఇలా మొదటి వారాంతం పూర్తి చేసుకొని వీక్ డేస్ లోకి అడుగు పెట్టిన ఈ చిత్రం మొదటి సోమవారం కూడా రికార్డు వసూళ్లు అందుకొని ఆల్ టైం రికార్డు సెట్ చేసింది.

అయితే ఈ చిత్రం హిందీ మార్కెట్ వసూళ్ల సంబంధించి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. ఆదివారం భారీ మొత్తంలో 40 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ చిత్రం ఈ సోమవారం 16.5 కోట్ల నెట్ వసూళ్లు అందుకొని అదరగొట్టింది. దీనితో నార్త్ మార్కెట్ లో కల్కి స్టడీగా దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. అయితే ఈ మొత్తం 5 రోజుల్లో కల్కి ఒక్క నార్త్ మార్కెట్ హిందీ వెర్షన్ లోనే 128.6 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్నట్టుగా ఇప్పుడు తెలిసింది. మొత్తానికి అయితే ప్రభాస్ నుంచి కల్కి మాసివ్ హిట్ గా కల్కి సూపర్ సిక్సర్ అయ్యిందని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు