రూ.200 కోట్ల‌తో అద‌ర‌గొట్టిన‌ క‌ల్కి!

రూ.200 కోట్ల‌తో అద‌ర‌గొట్టిన‌ క‌ల్కి!

Published on Jul 8, 2024 12:00 PM IST


పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన లేటెస్ట్ సెన్సేష‌న్ ‘క‌ల్కి 2898 AD’ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మైథాల‌జీ, సైన్స్ ఫిక్షన్ అంశాల‌ను ఈ సినిమాలో హ్యాండిల్ చేసిన విధానానికి అక్క‌డి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు.

ఇక హిందీ బెల్ట్ లో ‘క‌ల్కి’ మూవీ స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆదివారం ఈ సినిమా హిందీ వెర్ష‌న్ లో రూ.22 కోట్ల మేర వ‌సూళ్లు రాబ‌ట్టింది. దీంతో ఈ మూవీ మొత్తంగా రూ.212.50 కోట్ల మేర గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని బాలీవుడ్ మూవీ ఎక్స్ ప‌ర్ట్స్ చెబుతున్నారు. బాహుబ‌లి-2, ఆర్ఆర్ఆర్ త‌రువాత 200 కోట్ల మార్క్ ట‌చ్ చేసిన మూడో హిందీ డ‌బ్బింగ్ సినిమాగా కల్కి నిలిచింది.

నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని వంటి స్టార్ క్యాస్టింగ్ న‌టించారు. ఇక ఈ సినిమా టోట‌ల్ ర‌న్ లో ఎంత‌మేర వసూళ్లు రాబ‌డుతుందా, ఇంకా ఎన్ని రికార్డుల‌ను క్రియేట్ చేస్తుందా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు