నార్త్ లో మొదటి వారానికి రికార్డ్ క్లబ్ లో చేరిపోయిన “కల్కి”

నార్త్ లో మొదటి వారానికి రికార్డ్ క్లబ్ లో చేరిపోయిన “కల్కి”

Published on Jul 4, 2024 1:27 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దిశా పటాని హీరోయిన్ (Disha Patani) గా దీపికా పడుకోన్ అలాగే లెజెండరీ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు నటించిన అవైటెడ్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లతో అదరగొడుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. మరి ఈ చిత్రం తెలుగు స్టేట్స్, యూఎస్ మార్కెట్ లో అలాగే హిందీ మార్కెట్ లో కూడా సాలిడ్ వసూళ్లు కల్కి రాబడుతుంది.

అయితే హిందీ మార్కెట్ లో ఇప్పుడు మొదటి 7 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది. ఇక వారం రోజుల్లో అయితే రికార్డు మార్క్ 150 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. హిందీలో వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ చిత్రం మంచి వసూళ్ళని అందుకుంటుండగా ఇప్పుడు నిన్న బుధవారం వసూళ్లతో అయితే 150 కోట్ల మార్క్ ని ఈ చిత్రం కొట్టేసింది. బుధవారం నాడు కల్కి హిందీలో 11.5 కోట్ల నెట్ వసూళ్లు అందుకోగా దీనితో మొత్తం 153.1 కోట్ల నెట్ వసూళ్ల మార్క్ ని సొంతం చేసుకుంది. అలాగే నెక్స్ట్ 175 కోట్ల మార్క్ కి వెళ్లనుంది అని చెప్పాలి. మరి ఓవరాల్ గా కల్కి హిందీ మార్కెట్ లో ఎంతమేర రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు