నార్త్ అమెరికాలో “కల్కి” లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్.!

నార్త్ అమెరికాలో “కల్కి” లేటెస్ట్ వసూళ్ల డీటెయిల్స్.!

Published on Jul 6, 2024 3:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చి సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకొని అదరగొట్టింది. అయితే ఈ సినిమా రన్ మాత్రం నార్త్ అమెరికా రీజన్ లో ఊహించని లెవెల్లో కొనసాగుతుంది అని చెప్పాలి.

అక్కడ ఈ చిత్రం ఇప్పుడు వరకు 9 రోజుల రన్ ని కంటిన్యూ చేయగా ఈ 9 రోజుల్లో కూడా హాఫ్ మిలియన్ మార్క్ తగ్గకుండా కంటిన్యూ చేస్తుండడం విశేషం. అలాగే ఈ చిత్రం ఇప్పుడు నార్త్ అమెరికాలో 14.8 మిలియన్ మార్క్ కి చేరుకొని 15 మిలియన్ మైల్ స్టోన్ ని అందుకోనుంది అని చెప్పాలి. దీనితో ఈ అన్ని రోజుల్లో భారీ గ్రాస్ కలిపి ఒక్క నార్త్ అమెరికాలోనే కల్కి 123.76 కోట్ల మార్క్ కి చేరుకుంది. మొత్తానికి అయితే యూఎస్ మార్కెట్ లో కల్కి మానియా భారీ లెవల్లో ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు