“కల్కి” హిందీ, వరల్డ్ వైడ్ 9 రోజుల వసూళ్లు ఎంతంటే.!

“కల్కి” హిందీ, వరల్డ్ వైడ్ 9 రోజుల వసూళ్లు ఎంతంటే.!

Published on Jul 6, 2024 2:01 PM IST

చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమా సెలబ్రేట్ చేసుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ ల కాంబినేషన్ నుంచి వచ్చిన ప్రభంజనం “కల్కి 2898 ఎడి” అనే చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ భారీ వ్యయంతో తెరకెక్కించగా అందుకు తగ్గట్టుగానే వరల్డ్ వైడ్ గా అన్ని చోట్లా భారీ వసూళ్ళని కల్కి రిజిస్టర్ చేస్తుంది.

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా 9 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా హిందీ మార్కెట్ లో అలాగే వరల్డ్ వైడ్ గా సినిమా వసూళ్ల నంబర్స్ తెలుస్తున్నాయి. మరి 9 రోజుల్లో అయితే కల్కి చిత్రం హిందీ మార్కెట్ లో 175 కోట్ల భారీ గ్రాస్ ని అందుకోగా ఇక వరల్డ్ వైడ్ గా అయితే 9వ రోజు వసూళ్లతో సెన్సేషనల్ 800 కోట్ల మార్క్ ని అందుకొని నెక్స్ట్ స్టాప్ 900 కోట్ల మార్క్ దిశగా దూసుకెళ్తుంది. మరి ఈ వీకెండ్ లో కల్కి వసూళ్లు ఏ రేంజ్ లో నమోదు అవుతాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు